తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా టెన్త్‌ ఫీజు చెల్లింపునకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా టెన్త్‌ ఫీజు చెల్లింపునకు అవకాశం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

తత్కా

తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా టెన్త్‌ ఫీజు చెల్లింపునకు అవకాశ

శ్రీకాకుళం: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు తత్కాల్‌ స్కీం ద్వారా ఈనెల 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపా రు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ పరీక్ష తప్పిన విద్యార్థులతో పాటు రెగ్యులర్‌ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఫీజులకు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారని, ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. నామినల్‌ రోల్స్‌ ను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు

‘సమన్వయంతోనే

వివాదాల పరిష్కారం’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో వివిధ భూ సమస్యల కేసులు అధికారుల సమన్వయంతోనే పరిష్కారమవుతాయని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధ్యక్షతన జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లాలో గల ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పోలీస్‌ అధికారులతో రెవెన్యూ సదస్సు సమావేశాన్ని గురు వారం నిర్వహించారు. రెవెన్యూ సమస్యల వివరాలను ముందుగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అందించిన వివరాలపై కలెక్టర్‌ స్పందిస్తూ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మా ట్లాడుతూ తప్పుడు కేసులకు అండదండలు అందించిన వారికి భయం కలిగేలా బైండోవర్‌ కేసుల్లో పూచికత్తుగా ఉన్న మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని, తప్పు చేయా లనే ఉద్దేశం ఉన్నవారికి కేసుల భయం, ఆర్థిక భారం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రిటైర్‌ అయి గ్రామాల్లో ఉన్న నాయుడు, కారణం తదితర వాళ్ల సహాయంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అన్నారు.

స్థలాల పరిశీలన

సంతబొమ్మాళి: మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లోని మర్రిపాడు, కాకరపల్లిలో స్థలాలను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ గురువారం పరిశీలించారు. మర్రిపాడులో కాకరపల్లిలో ఏిపీఐఐసీ చెందిన 400 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాల్లో పోర్టు అనుబంధ పరిశ్రమలు, టౌన్‌షిప్‌ కోసం సేకరణ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మూలపేట పోర్టును నౌపడలో ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీని పరిశీలించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్‌ హేమసుందరరావు, ఆర్‌ఐ చంద్రమౌళి ఉన్నారు.

‘వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా పోలీసు సేవలు సులభం’

శ్రీకాకుళం క్రైమ్‌ : డిజిటల్‌ పాలనలో భాగంగా ప్రజలకు మరింత సులువుగా పోలీసు సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర (వాట్సాప్‌ గవర్నెన్సు) సేవలు అందరూ వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలనకు సంబంధించి అన్ని పనులను ఈ–ఆఫీస్‌ విధానంలోనే నిర్వహించాలని, పీజీఆర్‌ఎస్‌ (పబ్లిక్‌ గ్రీవెన్సు) ద్వారా స్వీకరించే ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలుండాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఎఫ్‌ఐఆర్‌ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ ప్రస్తుత స్థితి, ఈ–చలానా వివరాలు పొందవచ్చన్నారు. ఈ సేవలు పొందేందుకు 9552300009 నంబర్‌ను మొబైల్‌ఫోన్‌లో సేవ్‌ చేసుకుని ఆ నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపితే ప్రభుత్వ సేవల వివరాలు వస్తాయన్నారు. .

తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా టెన్త్‌ ఫీజు చెల్లింపునకు అవకాశ1
1/1

తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా టెన్త్‌ ఫీజు చెల్లింపునకు అవకాశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement