సీఆర్‌పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు
జలుమూరు: మండలంలోని చిన్న దూగాంనకు చెందిన సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి దుంగ వల్లయ్య తనపై దాడిచేసి గాయపరిచినట్లు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, సామాజిక కార్యకర్త రావాడ హిమంత్ బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో వల్లయ్య అనే సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడడం, మోసాలు చేయడంతో ఈయనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో రిట్ వేశానన్నాడు. ఇటీవల కోర్టు రిట్‌ను స్వీకరించినట్లు వల్లయ్యకు నోటీసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిగితే తన ఉద్యోగానికి ముప్పు వాటిళ్లుతుందనే భయంతో రిట్ పిటిషన్ వాపస్ చేసుకోవాలని వల్లయ్య ఒత్తిడి తెచ్చాడన్నారు. దీనికి తాను నిరాకరించడంతో దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. దాడిలో తనకు ముఖం, కంటిపై గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీంతో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌లో చేరానన్నాడు. అలాగే టెక్కలి డీఎస్సీని కూడా కలిసి వల్లయ్యపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీనిపై హెచ్‌సీ రాజశేఖర్ మాట్లాడుతూ చిన్నదూగం వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లారీ – కారు ఢీ
టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం గ్రామ జాతీయ రహదారిపై బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గార ప్రాంతానికి చెందిన కారు టెక్కలి మండలం బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి అదే మార్గంలో వెళ్తున్న లారీని ఓవర్‌టెక్ చేయబోయి అదుపుతప్పి లారీని ఢీకొంది. దీంతో కారు సమీప డివైడర్ పైకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన ఒక మహిళ, చిన్నారి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలు పాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అద్ది సింహాచలం, ధనలక్ష్మిల రెండేళ్ల బాబు భువన్ మంగళవారం రాత్రి డాబాపై ఆడుతూ విద్యుత్ తీగలకు తాకి ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో వాళ్ల నాన్నమ్మ తులసమ్మ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో అమె కూడా విద్యుత్ ఘాతానికి గురైంది. దీంతో క్షతగాత్రులను పూండిలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు.
దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి
శ్రీకాకుళం కల్చరల్: పలు ప్రాంతాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డా.ప్రత్తి అన్వేష్ అన్నారు. నగరంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జిల్లాలో ఉన్న బాప్టిస్ట్ చర్చి దైవ సేవకులందరూ బిషప్.రెవరెండ్.డా.కొత్తపల్లి అబ్రహం ఆధ్వర్యం బుధవారం సమావేశమయ్యారు. దీనిలో భాగంగా క్రైస్తవుల మీద, దైవ సేవకులు మీద, చర్చిల మీద జరుగుతున్న దాడులు, వ్యతిరేక ప్రచారాలపై చర్చించారు. భవిష్యత్‌లో జిల్లాలో ఉన్న క్రైస్తవ దైవ సేవకుల సంఘాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి
పొందూరు: మండలంలోని తానెం గ్రామానికి చెందిన బాకి పాపినాయుడు(65) గడ్డి మందు తాగి మృతి చెందినట్లు బుధవారం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 2వ తేదీన మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సీఆర్‌పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు
సీఆర్‌పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు
సీఆర్‌పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు


