తాగునీరు అందించేందుకు చర్యలు
కవిటి: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు సంబంధించి ‘ఏం నేరం చేశామని ఈ శిక్ష’ శీర్షికతో జనవరి 28వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు పటిష్టమైన చర్యల దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు కవిటి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.3.6 లక్షల వ్యయంతో 15,000 లీటర్ల అండర్ గ్రౌండ్ సంప్ నిర్మాణానికి ఎమ్మెల్యే అశోక్, సర్పంచ్ పూడి లక్ష్మణరావులు బుధవారం భూమిపూజ చేశారు. త్వరలో ఈ పనులు పూర్తిచేసి తాగునీరు అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అనుమానాస్పదంగా ఆర్మీ హవల్దార్ మృతి
మందస: మండలంలోని రాధాకృష్ణపురం గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ లోళ్ల జోగారావు(36) బుధవారం హరిపురం రైల్వే లైన్ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జోగారావు ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో దేశానికి సేవలు అందిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియలేదు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవపంచనామ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన యువకుడు, పశు పెంపకందారుడు కొల్లి నాగేశ్వరరావుపై బుధవారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారంతో దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తనకు ఉన్న పశువుల శాలలో ఉదయం పాలు తీస్తుండగా.. ఒక వ్యక్తి వచ్చి తనకు పాలు కావాలని అడుగుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే అప్పటికే కొంతమంది వ్యక్తులు కారులో దాడి చేసేందుకు మాటు వేసినట్లు తాను గమనించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఇంతలో పాల కోసం తన వద్దకు వచ్చిన దుండగుడు ఒక్కసారిగా తన కళ్లలో కారం కొట్టి దాడి చేసే ప్రయత్నం చేయడంతో తాను తప్పించుకున్నట్లు చెప్పాడు. ఇది గమనించిన దుండగులు కారులో పరారయ్యారని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగేశ్వరరావుపై జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది.
తాగునీరు అందించేందుకు చర్యలు
తాగునీరు అందించేందుకు చర్యలు
తాగునీరు అందించేందుకు చర్యలు


