గ్రిగ్స్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గ్రిగ్స్‌ పోటీలు ప్రారంభం

Feb 3 2026 7:12 AM | Updated on Feb 3 2026 7:12 AM

గ్రిగ

గ్రిగ్స్‌ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా జిల్లాస్థాయి బాలుర గ్రిగ్స్‌ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కబడ్డీ, ఖోఖో, సాఫ్ట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, బాల్‌ బాడ్మింటన్‌ క్రీడాంశాల్లో పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన పాఠశాలల జట్లకు జ్ఞాపికలను అందజేశారు. మిగిలిన వివిధ క్రీడాంశాల్లో పోటీలు మంగళవారం నిర్వహించి గ్రిగ్స్‌ పోటీలను ముగిస్తారు. కాగా అంతకుముందు పోటీలను డీఈవో ఎ.రవిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పోటీల నిర్వహణ పాఠశాల హెచ్‌ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, గ్రిగ్స్‌ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బీవీ రమణ, ఆర్‌.స్వాతి, ఎం.తిరుపతిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రిగ్స్‌ పోటీలు ప్రారంభం 1
1/1

గ్రిగ్స్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement