చావే శరణ్యం
తన భూమి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సంవత్సరాల తరబడి కాళ్లరిగేలా తిప్పుతున్నారని.. కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని సంతబొమ్మాళి మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన జీరు ధర్మారావు అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమంలో తన సమస్యను విన్నవించుకునేందుకు వచ్చారు. తన గ్రామంలో పరపటి జంగమయ్యకు చెందిన 3.50 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా.. అప్పట్లో అధికారులతో కుమ్మకై ్క మరో భూమిని చూపించేశారని వాపోయాడు. ఆ సమస్యను పరిష్కరించాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నప్పటికీ సంతబొమ్మాళి మండలం రెవెన్యూ అధికారులు డబ్బులు దోచేస్తున్నారు తప్ప, భూ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వీఆర్వోగా పనిచేసిన ప్రసాదరావు కూడా తన వద్ద రూ.50 వేలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించాడు. చివరకు సీఎం ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించకుండా రెవెన్యూ అధికారులు తనతో ఆడుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ధర్మారావును పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత రైతు ధర్మారావు మరోసారి ఫిర్యాదు చేశారు.


