చెక్‌ పవర్‌ను పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

చెక్‌ పవర్‌ను పునరుద్ధరించండి

Feb 3 2026 7:12 AM | Updated on Feb 3 2026 7:12 AM

చెక్‌ పవర్‌ను పునరుద్ధరించండి

చెక్‌ పవర్‌ను పునరుద్ధరించండి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఎచ్చెర్ల మండలంలోని బొంతలకోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు చెక్‌ డ్రాయింగ్‌ అధికారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని, దానిని పునరుద్ధరించాలని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ జగదేశ్వరరావు తదితరులు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ చెక్క పవర్‌ను 2025 ఏప్రిల్‌ 2వ తేదీన తాత్కాలికంగా నిలుపుదల చేశారని, అయితే గడువు పూర్తయినా ఇంకా పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. దీనివలన పంచాయతీలో కనీస అవసరాలు నేరవేరక, చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 2025 నవంబర్‌ 25న నాలుగు వారాల్లో చెక్కు డ్రాయింగ్‌ ఇవ్వాలని హైకోర్టు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement