పాఠశాలలో పాము కలకలం
పొందూరు: మండలంలోని మలకాం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాము కలకలం రేపింది. పాఠశాల బాత్ రూమ్ గజాల తలుపుపై సుమారు 5 అడుగుల పాము కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు చెప్పడంతో బయటకు పంపించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
కళాశాలలో లాప్‌టాప్‌లు దొంగతనం
పాతపట్నం: స్థానిక ఆల్ ఆంధ్ర రోడ్డు సమీపంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. కళాశాల తలుపుల తాళాలు పగలుగొట్టి కంప్యూటర్ లాబ్‌లోని ఎనిమిది లాప్‌టాప్‌లు, రెండు ఎల్‌ఈడీలు, మూడు డెస్క్‌టాప్‌లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు ప్రిన్సిపాల్ రాజగోపాల్ ఆచార్యులు తెలిపారు.


