కోతలే.. చేతల్లేవు! | - | Sakshi
Sakshi News home page

కోతలే.. చేతల్లేవు!

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

కోతలే

కోతలే.. చేతల్లేవు!

కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి

కేంద్ర మంత్రి ఉన్నా కేటాయింపులు

శూన్యం

ప్రచారం తప్ప కనిపించని ప్రయోజనం

ఉద్యోగులకు రిక్తహస్తం

కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగులను నిరాశ పరిచింది. ఇన్‌కంటాక్స్‌ శ్లాబ్‌లు యథాతధంగా ఉన్నా యి. ఆధారిత పన్ను మినహాయింపులో మార్పు లేదు.

– హనుమంతు సాయిరాం,

ఏపీ ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు

ఆశాజనకంగా లేదు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు. రైల్వేజోన్‌కు సరిపడా నిధులు కేటాయించలేదు. జాతీయ రహదారి నరసన్నపేట నుంచి ఆరులైన్లకు నిధులు కేటాయించలేదు.

– హెచ్‌.సుబ్రహ్మణ్యం,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, బీఆర్‌ఏయూ

పన్ను ఉపశమనం ఎక్కడ?

రూ.12.21 లక్షల కోట్లు రికా ర్డు మూలధన ఖర్చు, రూ. 53.47 లక్షల కోట్లు మొత్తం వ్యయంతో ప్రభుత్వం భారీ పెట్టుబడి దూకుడు చూపించినా ఆదాయ పన్ను శ్లాబ్‌లలో ఒక్క రూపాయి మార్పు కూడా చేయలేదు. బడ్జెట్‌ ఒక పెట్టుబడి ఆధారిత దీర్ఘకాల వృద్ధి దిశగా భారత వ్యవస్థను మళ్లించే ప్రయత్నంగా వర్ణించవచ్చు.

– డాక్టర్‌ మళ్ల పూర్ణసూరిగణేష్‌,

ఆర్థిక విశ్లేషకులు, ట్రిపుల్‌ ఐటీ

వేతన జీవులకు నిరాశ

ఆదాయ పన్ను శ్లాబులు మార్చకపోవడం వేతనజీవులకు నిరాశే. స్టాండర్డ్‌ డిడక్షన్‌ 1,50,000కు పెంచి ఉండాల్సింది. సేవింగ్స్‌ పరిమితిని కనీసం 2.5 లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించి ఉండాల్సింది.

– బి.వెంకటేశ్వర్లు,

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సిక్కోలుపై సీతమ్మ మళ్లీ శీతకన్ను వేశారు. జిల్లాలో కేంద్ర మంత్రి ఉన్నా, పక్క జిల్లా ఎంపీ కూడా కూటమికే చెందినా ఈ ప్రాంతానికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. కోతలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మ రోసారి రుజువైంది. కేంద్ర బడ్జెట్‌లో సిక్కోలుకు ప్రత్యేకంగా సాధించిందేమీ కనిపించలేదు. అందులోనూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయు డు చేసిన కృషి లేశమాత్రమైనా లేకపోవడం విచారకరం.

స్వల్పకాలిక ప్రయోజనాలే

● కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకమైన ప్రయోజనాలేవీ కల్పించలేదు. దేశవ్యాప్తంగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకం, జీడి పప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్టు ప్రకటన తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జిల్లాకు అన్యాయమే జరిగింది. కొత్తగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు ఉత్పత్తికి ప్రత్యేక చర్యల వలన ఉద్దానంకు కొంత మేలు జరగనుంది.

● భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నుంచి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరగలేదు.

● కిసాన్‌ డ్రోన్‌ పథధకం కింద రైతులకు ప్రోత్సాహం, మత్స్యకారులకు ఆధునిక జెట్టీలు, కోల్ట్‌ స్టోరేజీల నిర్మాణాలకు సాయంపై బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు.

● ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగలేదు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు రాయితీలు ప్రకటించలేదు.

రైల్వే, రహదారులకు స్పష్టత కరువు

● నౌపడ– గుణుపూర్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం రూ. 900కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ లైన్‌ వస్తే వాణిజ్య కార్యకలాపాలు పెరు గుతాయి. కానీ బడ్జెట్‌లో ఎక్కడా దీనిపై ప్రస్తావించలేదు.

● పలాస రైల్వే ఫ్లై ఓవర్‌ పనులకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు.

● అమృత్‌ భారత్‌ పథం కింద శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు కూడా నిధుల కేటాయింపుపై క్లారిటీ లేదు.

● మూలపేట పోర్టు కనెక్టివిటీ రైల్వే లైన్‌, పలుచోట్ల రైల్వే అండర్‌ పాసెజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటిపైనా బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు.

● ఈస్ట్‌కోస్టు రైల్వే లైన్‌తో పాటు విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్ల అభివృద్ధిపైనా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.

● జిల్లాలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రస్తుతం నాలుగులైన్ల జాతీయ రహదారి మా త్రమే ఉంది. దీన్ని ఆరు లైన్లుగా మార్పు చేయా ల్సి ఉంది. ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పలు వంతెనల నిర్మాణాలు కూడా చేపట్టాలి. ఇవన్నీ పూర్తి చేయాలంటే రూ. వేల కోట్లలో అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు.

కోతలే.. చేతల్లేవు! 1
1/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 2
2/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 3
3/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 4
4/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 5
5/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 6
6/7

కోతలే.. చేతల్లేవు!

కోతలే.. చేతల్లేవు! 7
7/7

కోతలే.. చేతల్లేవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement