రైతులపై అదనపు భారం | - | Sakshi
Sakshi News home page

రైతులపై అదనపు భారం

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

రైతులపై అదనపు భారం

రైతులపై అదనపు భారం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు వెతలు ఇంకా కనిపిస్తున్నాయి. జిల్లాలో పండిన ధాన్యం మిల్లింగ్‌ చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ మన జిల్లాలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యంను పక్క జిల్లాలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది 4.07 లక్షల ఎకరాల్లో వరి పంటలు ఖరీఫ్‌లో వేశారు. ప్రభుత్వం 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకుంది. 6.22 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యంను జిల్లాలో ఉన్న 271 రైస్‌ మిల్లులకు మిల్లింగ్‌కు పంపించారు. కానీ జిల్లా లో చాలా చోట్ల పొలాల్లో దాదాపు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అపరాల పంటలు తర్వాత వాటిని రైతులు వాటిని నూర్పు చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు వీటిని నూర్చే పరిస్థితి లేదు. దీంతో అదనంగా ధాన్యం సేకరించా లని రైతులు కోరుతున్నారు. తాజాగా 50వేల మెట్రి క్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఇది ఏమాత్రం సరిపోదని పెంచాలని రైతులు కోరుతున్నారు.

పక్క జిల్లాలకు మన ధాన్యం

జిల్లాలో రైతులు పండించిన ధాన్యంను పక్క జిల్లాల మిల్లర్లకు అందజేసే అవకాశం ఈ ఏడాది ప్రభుత్వం కల్పించింది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. జిల్లాలో పండిన ధాన్యం జిల్లాలో మిల్లర్లు మా త్రమే కొనుగోలు చేసేవారు. ప్రభు త్వం నిర్ణయించే లక్ష్యాలు కూడా స్థానిక మిల్లర్లు సాధించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు చెంది న మిల్లర్ల ఒత్తిడికి లోబడి ఆ జిల్లాకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం పక్క జిల్లాలకు తరలిపోయాయి. జిల్లాకు కొత్తగా కొనుగోలు లక్ష్యాలు ప్రభుత్వం కల్పించకపోతే, ఇక్కడ మిగిలి ఉన్న ధాన్యం మరో రెండు లక్షలు మెట్రిక్‌ టన్నుల వరకు ఇతర జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరి గితే జిల్లా మిల్లర్లు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి.

మిల్లర్లకు అన్యాయం

జిల్లాలో తమకు అన్యాయం జరుగుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ఈ ఏడాది అన్ని రకాలుగా ప్రభుత్వం మిల్లర్లను ఇబ్బంది పెట్టిందని, బ్యాంకు గ్యారెంటీలు అన్నీ ఇచ్చినా వారికి సరిపడినంత ధాన్యంను అందజేయలేదని ముందు నుంచీ ఫి ర్యాదులు ఉన్నాయి. పోలాకికి చెందిన మిల్లర్‌ ఒకరు నేరుగా కలెక్టర్‌, జేసీలకే ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు, ఉత్సవాలకు, ఇతర సంక్షేమాలకు మిల్లర్ల నుంచి సాయం తీసుకుంటున్న రాజకీయ నాయకులు వారిని కాదని ఇతర జిల్లాల మిల్లర్లకు మేలు చేసేలా వ్యవహరించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పక్క జిల్లాలకు వెళ్తున్న మన ధాన్యం

జిల్లాలో కొనుగోలు లక్ష్యాలు పూర్తి

అదనపు కొనుగోలు అంతంతమాత్రమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement