రాష్ట్రంలో రాక్షస పాలన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజం
‘అరాచకం సృష్టిస్తున్నారు’
సోంపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికార పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు దుయ్య బట్టారు. నర్తు రామారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై అధికార పార్టీ నేతలు దాడి చేసి వాహనాలు దగ్ధం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో, ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని అన్నారు. అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేసిన వారు, దాడి చేయించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
‘రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ అరాచక పాలన సాగుతోందని, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయించడమే కాకుండా, ఆయన పార్టీ కార్యా లయం, ఇంటిని ముట్టడించి, ఫర్నీచర్, విలువైన వస్తువులకు నిప్పంటించి తగులబెట్టడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ప్రణాళికతో బాబు, లోకేష్ జరిపించిన హత్యాయత్నంగానే భావించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన మాట పక్కనబెడితే ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి చంద్రబాబు నోటి మాటలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కల్తీయేనని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనగా మారి తెలుగు దేశం పార్టీని సర్వ నాశనం చేస్తుందన్నారు.
నరసన్నపేట: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛ ను హరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబా బుపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విపక్ష నేతలే లక్ష్యంగా దాడులు పెరిగి పోయాయని ఆందోళన చెందారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారంటే కూటమి పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి దాడులు చేస్తున్నవారికి పోలీసులు రక్షణగా వ్యవహరించారని విమర్శించారు. బహిరంగంగా కర్ర లు, కత్తులు పట్టుకొని రాంబాబుపై దాడికి తెగబడ్డారని, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. వీరిపై కేసులు పెట్టాల్సింది పోయి తిరిగి రాంబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహరంలో లేనిపోని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేశారని భక్తుల మనోబావాలను దెబ్బతీశారని ఇది ప్రజల్లోకి వెళ్లడంతో డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అంబటిపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. రాంబాబుపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన


