కూర్మ విలాపం | - | Sakshi
Sakshi News home page

కూర్మ విలాపం

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

కూర్మ

కూర్మ విలాపం

● తీరానికి కొట్టుకువస్తున్న తాబేళ్ల కళేబరాలు

● నిర్లక్ష్య ధోరణిలో మత్స్యశాఖ

● ఆందోళనలో పర్యావరణ ప్రేమికులు

ఇచ్ఛాపురం రూరల్‌: జిల్లా తీర ప్రాంతానికి తాబేళ్ల కళేబరాలు తరచూ కొట్టుకుని వస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను ఈ దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు లక్ష్మీపురం నుంచి జిల్లా చివరి మత్స్యకార గ్రామం తడా వరకు ఏటా 1500 నుంచి 2000 వరకు ఈ తాబేళ్లు చనిపోతుంటా యని మత్స్యకారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఆ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. శీతాకాలంలో ఆడ తాబేళ్లు సముద్రంలో కిలో మీటర్ల దూరం ప్రయాణించి తీరానికి చేరే ప్రయత్నం చేస్తాయి. అనువైన చోట గుడ్లు పెట్టేందుకు స్థలం ఎంపిక చేసుకుంటాయి. నవంబర్‌ నుంచి మే నెల వరకు ఎక్కువగా వస్తుంటాయి. ఆడ తాబేళ్లు తీరంలో రాత్రిళ్లు జనసంచారం లేని సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. లోతైన గుంతలను తవ్వి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి వెళ్లిపోతాయి. ఏప్రిల్‌, మే ప్రాంతంలో గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చి సముద్రంలోకి చేరుతాయి. సంతానోత్పత్తి దశలో తాబేళ్లు మృత్యువాత పడుతుండటం విచారకరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మానవ తప్పిదాలే కారణమా..?

వేట పడవల నుంచి వేసే నైలాన్‌ వలల్లో చిక్కుకుని తాబేళ్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థాని కులు చెబుతున్నారు. మరోవైపు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం, ఆధునిక మరబోట్ల తాకిడి, చలి వాతావరణం తాబేళ్ల మృతికి కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ, మత్స్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృత తాబేళ్లను తొలగించడంలోనూ, కారణాలపై అధ్యయనం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైజాగ్‌ బోట్లు వల్లే మృతి

నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఏదో ఏడాది ఒక టో, రెండో తాబేళ్లు చనిపోయే వి. ఈ మధ్య వైజాగ్‌ నుంచి బోట్లు రావడంతో తాబేళ్లు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ ప్రాంతానికి ఆ బోట్లు రాకుండా అధికారులు హెచ్చరిస్తే తాబేళ్లు మృతి చెందే అవకాశం లేదు.

– బుడ్డ లింగరాజు, మత్స్యకారుడు, డొంకూరు

అవగాహన కల్పిస్తున్నాం

కొంత మంది సముద్రం ఒడ్డు కు దగ్గరలో పెద్ద పడవలతో అక్రమంగా చేపలను వేటాడుతుండడంతో ఒడ్డుకు వచ్చే క్ర మంలో ఈ తాబేళ్లు పడవల వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. ముఖ్యంగా టెలీ బోట్లు నిరోధి స్తే ఫలితం ఉంటుంది. మత్స్యకారులకు తాబేళ్లపై అవగాహన కల్పిస్తున్నాం.

– ఏవీ నాగేంద్రరావు,

సహాయక అటవీ సంరక్షణ అధికారి

కూర్మ విలాపం 1
1/2

కూర్మ విలాపం

కూర్మ విలాపం 2
2/2

కూర్మ విలాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement