నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్‌ చేయాలన్నారు.

టెక్కలిలో రెవెన్యూ క్లినిక్‌

జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రె వెన్యూ డివిజన్‌ కార్యాలయంలో జిల్లా మొ త్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్‌’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సర్వే వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

‘లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి’

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): భవన నిర్మాణ కా ర్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన చట్టం అమలు చేయా లని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, సిటు టౌన్‌ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాకమిటీ సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్రంలో సుమారు 30 లక్షలు, జిల్లాలో సుమారు 80 వేల మంది నిర్మాణరంగ కార్మికులు ఉన్నారని, వారు పోరాడి సాధించుకున్న నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని నిలుపుదల చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ రాజకీయ ప్రచారాలకు భవన నిర్మాణ సంక్షేమ నిధిని వినియోగించడం దుర్మార్గమని విమర్శించారు. గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు ని పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం హా మీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. పెండింగ్‌ క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. తంగి హరి నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తర్ల లక్ష్మణరావు, బూసి లక్ష్మణ రావు, పనస రమేష్‌ వివిధ మండలాల నుంచి కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement