శ్రీకాకుళం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గ్రామాలకు నిరాశే
కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకు కొంత ఊరట. కానీ గ్రామీణ ఆర్థిక రంగానికి నిరాశే. ఇది పేరుకే ఆత్మ నిర్భర భారత్ బడ్జెట్. రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు చేయలేదు. విభజన చట్టం హామీలు, గిరిజన యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్ట్ విస్మరించారు.
– బొడ్డేపల్లి మోహనరావు, ఆల్ ఇండియా లాయర్స్
అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు
సామాన్యులకు ప్రయోజనం లేదు
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌తో సామాన్యులకు ఏమీ ప్రయోజనం లేదు. మహిళలకు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉంది. విద్యారంగానికి నిధులు కేటాయించలేదు. యువత, రైతులు, ఉపాధి గురించి ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. – రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం


