కీలక ప్రాజెక్టులకు చోటేదీ..? | - | Sakshi
Sakshi News home page

కీలక ప్రాజెక్టులకు చోటేదీ..?

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

కీలక ప్రాజెక్టులకు చోటేదీ..?

కీలక ప్రాజెక్టులకు చోటేదీ..?

● ఉద్దానం ఏరియాలో కిడ్నీ భూతం పట్టి పీడిస్తోంది. ప్రతి రోజూ వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి, డ యాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, కొంతమేరకు ఆదుకుంది. దాని కొనసాగింపుగా కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. గత ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు ఐసీఎంఆర్‌ చొరవ తీసుకుని, పరిశోధనలకు ముందుకొచ్చింది. కానీ, బడ్జెట్‌లో జాతీయ స్థాయి నిధులను మాత్రం కేటాయించలేదు.

● జిల్లా ఆర్థికంగా వెనకబడినా విద్య, స్కిల్డ్‌ పరంగా టాలెంటెడ్‌ వ్యక్తులు ఉన్నారు. కానీ సరైన సంస్థల్లేక ప్రతిభను చూపలేకపోతున్నారు. ఇక్కడో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. కానీ ఈ బడ్జెట్‌లోనూ అవేవీ జరగలేదు.

● అధిక దిగబడిని ఇచ్చే కొత్త కొత్త వంగడాల పరిశోధనలు జిల్లాలో జరుగుతున్నాయి. నైరా వంటి పరిశోధనా స్థానం ఉన్నప్పటికీ దానికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందితే దేశానికి మరిన్ని కొత్త కొత్త వంగడాలు పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ పాలిటెక్నికల్‌ కళాశాల, హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, వెట ర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల వంటివి ఏర్పాటు చేశారు. అక్కడ తయారయ్యే విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు దగ్గరగా ఉంటే మేలు జరిగేది. ఆ కానీ ప్రయత్నం జరగడం లేదు.

● వైఎస్సార్‌సీపీ హయాంలో బుడగట్లపాలెం పిషింగ్‌ హార్బర్‌, జెట్టీ నిర్మాణాలు చేపట్టగా ఇప్పుడా పనులు పూర్తి చేసేందుకు ఈ ప్రభు త్వం చేస్తున్న ప్రణాళిక ఏంటో కన్పించడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో వీటికోసం ప్రత్యేకంగా కేటాయించిన దాఖలాల్లేవు.

● జిల్లాలో అపారమైన అటవీ వనరులు ఉన్నా యి. ముఖ్యంగా ఔషధ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్సిటిట్యూట్‌ ఫర్‌ మెడిషనల్‌ ప్లాంట్స్‌ (కేంద్రీయ ఔషద మొక్కల పరిశోధనా సంస్థ) వంటివి ఏర్పాటు చేస్తే ప్రపంచానికి కొత్త కొత్త ఔషధాలను పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ బడ్జెట్‌లో ప్రస్తావన లేదు.

● జిల్లాలో అనేక వ్యవసాయ ఉత్పత్తులు తయా రవుతున్నాయి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపయోగపడుతుంది. వీటికీ బడ్జెట్‌లో చోటు దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement