అరసవల్లిలో మాఘ సందడి | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో మాఘ సందడి

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

అరసవల

అరసవల్లిలో మాఘ సందడి

అరసవల్లి: పవిత్ర మాఘ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం వేకువజామునకే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్థానిక ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలో క్షీరాన్నం వండి ఆదిత్యునికి భోగం నివేదించారు. అలాగే ఆరోగ్యం కోసం పలువురు భక్తులు సూర్యనమస్కారాల పూజలను చేయించుకున్నారు. మాఘమాసం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణచేసారు.

ఒక్క రోజు ఆదాయం రూ.18,33,261

ఆదిత్యాలయంలో ఆదివారం ఒక్కరోజే రూ.18,33,261 ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,65,200, విరాళాల రూపంలో రూ.1,71,271, ప్రసాదాల రూపంలో రూ.3,99,090, ఆన్‌లైన్‌ ద్వారా రూ.97,700 విరాళం వచ్చినట్లు వివరించారు.

అరసవల్లిలో మాఘ సందడి 1
1/3

అరసవల్లిలో మాఘ సందడి

అరసవల్లిలో మాఘ సందడి 2
2/3

అరసవల్లిలో మాఘ సందడి

అరసవల్లిలో మాఘ సందడి 3
3/3

అరసవల్లిలో మాఘ సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement