రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌ : టెక్కలి వలేసాగరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రావివలసకు చెందిన విద్యుత్‌ లైన్‌మేన్‌ పి.రామచంద్రుడు ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి వలేసాగరం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వైపు వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు.

పశువులు పట్టివేత

రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 7 గంటలకు అక్రమంగా తరలిస్తున్న ఐదు పశువులను పట్టుకున్నారు. శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు లగేజీ వ్యాన్‌లో తరలిస్తుండగా లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకుని కేసు నమోదు చేశారు.

గంజాయితో ఇద్దరు అరెస్టు

వజ్రపుకొత్తూరు రూరల్‌: పూండి రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ బి.నీహర్‌ తన బృందంతో కలిసి పూండి రైల్వే స్టేషన్‌ వద్ద మాటువేశారు. ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్‌కు చెందిన ప్రమోద్‌, సరోజ్‌లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని ప్రశ్నించగా గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

హిరమండలం: ఎల్‌.ఎన్‌.పేట మండలం చిట్టిమండలం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మువలస గ్రామానికి చెందిన ఎస్‌.పరశురాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాం కొమ్మువలస నుంచి సరుబుజ్జిలి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ముందు వెళుతున్న బస్సును ఓవర్‌ టేక్‌ చెయ్యిబోయి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన పరశురాంను స్థానికులు 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు 1
1/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు 2
2/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement