లారీడ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీడ్రైవర్‌ మృతి

Feb 2 2026 8:22 AM | Updated on Feb 2 2026 8:22 AM

లారీడ్రైవర్‌ మృతి

లారీడ్రైవర్‌ మృతి

ఎచ్చెర్ల : ఎచ్చెర్ల జాతీయ రహదారిపై వెళ్తున్న భాస్కరరావు అనే లారీ డ్రైవర్‌ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి చిలకపాలెం వెళ్తుండగా కింతలిమిల్లు సమీపంలో ఫ్లై ఓవర్‌ వంతెన వద్ద లారీ ఆపి దిగాడు. అసౌకర్యానికి గురై వాంతులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. భాస్కరారావుది విజయనగరం రైతుబజార్‌ వీధి. కుటుంబ సభ్యులకు క్లీనర్‌ సమాచారం అందించాడు.

ఘనంగా తెరవే

కవి సమ్మేళనం

శ్రీకాకుళం కల్చరల్‌ : నగరంలోని శాంతినికేతన్‌ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 113వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి నిర్వహణలో క్రియాశీలక సభ్యులు ఇద్ది పాపయ్య అతిథిగా పాల్గొన్న కవి సమ్మేళనంలో 13 మంది హాజరై తమ కవితలు చదివి వినిపించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ హిందీ ప్రచారసభ కార్యదర్శి, ఇంటెలెక్చువల్‌ ఫోరం వ్యవస్థాపకులు కోనె శ్రీధర్‌ కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యుడిగా నియామకం కావడం పట్ల సభ్యులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కవులు తోట గోపాలరావు, యం.ఉపేంద్రశర్మ, యు.నాగేశ్వరరావు, ఆర్‌.వి.రమణమూర్తి, గుడిమెట్ల గోపాలకృష్ణ, ఐ.పాపయ్య, డబ్బీరు గోవిందరావు, కిల్లాన శ్రీనివాస్‌, వావిలపల్లి రాజారావు, పి.వి.దుర్గాప్రసాద్‌, కుప్పిలి త్రినాథరావు, టి.విజయలక్ష్మణ్‌, కె.బి.రవికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement