పొందూరులో అగ్నిప్రమాదం
● ట్రేడర్స్ గొడౌన్ దగ్ధం ● రూ.94 లక్షల ఆస్టినష్టం
పొందూరు: మండల కేంద్రం పొందూరులోని శ్రీసాయి సూర్య హర్షిని ట్రేడర్స్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు తెరిచే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో యజమాని పోలాకి రవి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గోదాంలో ఉన్న వివిధ వ్యవసాయ ఉత్పత్తుల బస్తాలు కాలి బూడిదైపోయాయి. శనివార రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.94 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 217 టన్నుల మొక్కజొన్న బస్తాలు, 650 నువ్వుల బస్తాలు, 200 మిర్చి బస్తాలు, వేరుశెనగ యంత్రం, ఇతర వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు.
పొందూరులో అగ్నిప్రమాదం


