విద్యార్థులకు అభినందనలు
నరసన్నపేట: మండలంలో మారుమూల గ్రామం బసివలస ప్రాథమిక పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధులు రాష్ట్ర స్థాయి స్పెల్–బీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి అభినందించారు. మండల, జిల్లా, జోన్‌స్థాయిల్లో ప్రతిభ చూపిన బసివలస విద్యార్థులు బమ్మిడి యశ్విక(2వ తరగతి), పాగోటి నవీన్ (3వ తరగతి), ఇంటివెనుకల నిహారిక (3వ తరగతి)లను ప్రత్యేకంగా అభినందించారు. శనివారం రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీలను ఏపీ ప్రభుత్వం శనివారం విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో నిర్వహించింది. ఇందులో యశ్విక చివరి రౌండ్‌వరకూ వెళ్లి గట్టి పోటీ ఇచ్చినట్లు ఉపాధ్యాయుడు అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు జారీ చేశారు. పోటీల్లో నరసన్నపేట మండలం బొరిగివలస స్కూల్‌కు చెందిన తంగి లాస్యశ్రీ కూడా ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు అభినందించారు.


