●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం

Feb 1 2026 3:02 AM | Updated on Feb 1 2026 3:02 AM

●వత్సవలస రాజమ్మ తల్లి      జాతర ప్రారంభం

●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం

●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం

గార: జిల్లాలోనే ప్రాముఖ్యత గల వత్సవలస రాజమ్మ తల్లి జాతర శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. శనివారం సాయంత్రానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఆదివారం ఉదయం ప్రధాన పీఠాల వద్ద పూజలు జరుపుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటారు. వత్సవలస తొలివారం జాతరకు వచ్చే భక్తుల వాహనాలు తూలుగు మీదుగా వత్సవలస రావాలని, తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం మీదుగా శ్రీకాకు ళం పట్టణం వైపు వెళ్లాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌. వివేకానంద, సీఐ కె.పైడపునాయుడు తెలిపారు. సముద్ర స్నానాల్లో లోతుగా దిగవద్దని, పోలీసులకు సహకరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement