పర్సు అప్పగింత
పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని అచ్యుతాపురం ఎదురుగా రవింద్రభారతి పాఠశాల సమీపంలో శనివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాణిపేటకు చెందిన బోడు గణపతికి రహదారిపై రూ.11,290, వివిధ కార్డులతో ఉన్న పర్సు దొరికింది. వెంటనే పాతపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్‌ఐ కె.మధుసూదనరావు, ఏఎస్‌ఐ కె.రామమూర్తికి అప్పగించారు. పర్సులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బాధితుడు కొరసవాడ గ్రామం పెద్దవీధికి చెందిన గొలుకొండ సతీష్‌గా గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. సీఐ సమక్షంలో పర్సు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న గణపతిని పోలీసులు అభినందించారు.


