గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు
గార: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన బోర జీవన్‌కిషోర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఐఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన 2022 గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఎంపికై ప్రస్తుతం విజయనగరం క్రైమ్ డివిజన్‌లో ఎన్‌ఫోర్సుమెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి డాక్టర్ బోర ప్రసాదరావు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి బోర గీతారాణి గృహిణి. భార్య పూర్ణవర్షిత హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగం ఉండాలన్న కోరికతో మరోసారి గ్రూప్–1 పరీక్ష రాసి విజయం సాధించాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మండలవీధికి చెందిన తాళ లక్ష్మి (59) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు కుమార స్వామి, రవికుమార్ నిర్ణయించారు. విషయాన్ని రెడ్‌క్రాస్‌కు తెలియజేయడంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి. చిన్నికృష్ణల ద్వారా కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.
ఆల్‌రౌండ్ చాంపియన్‌గా నరసన్నపేట
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి గ్రిగ్స్‌మీట్ ఫైనల్స్ పోరు మొదలయ్యాయి. తొలుత జరిగిన బాలికల గ్రిగ్స్‌మీట్ ఫైనల్స్ పోటీల్లో అన్ని విభాగాల్లో విజయదుందుభి మోగించిన నరసన్నపేట జీహెచ్ స్కూల్ ఆల్‌రౌండ్ చాంపియన్‌గా నిలిచింది. స్పోర్ట్స్ చాంపియన్‌గా జెడ్పీహెచ్ స్కూల్ బొడ్డపాడు, గేమ్స్ చాంపియన్‌గా జీహెచ్ స్కూల్ నరసన్నపేట, జెడ్పీహెచ్ స్కూల్ అంపోలు సంయుక్తంగా నిలిచాయి. బాలికల పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు/క్రీడాకారులకు శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్‌మీట్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్‌మీట్ కార్వనిర్వాహక పాఠశాల(శ్రీకాకుళం పీఎస్‌ఎన్‌ఎంహెచ్‌స్కూల్) హెచ్‌ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, స్కూల్‌గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, ఎం.తిరుపతిరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, రాజారావు, రాజశేఖర్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా బాలుర విభాగంలో జిల్లాస్థాయి గ్రిగ్స్‌మీట్ ఫైనల్స్ పోటీలు నిర్వహించనున్నారని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్‌షాప్
ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్ (ఎన్‌డీఎల్‌సీ)పై రెండురోజులుగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సారికి టెక్నాలజీ సంస్థ సీఈవో ప్రసాద్ సారికి మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న పరిమాణాలు, వాస్తవ వినియోగాలను వివరించారు. జనరల్ ఏఐలో కొత్త విధానాలు, ప్రాయోగిక ప్రదర్శనలు, ఏఐ ఆధారిత సాప్ట్‌వేర్ అభివృద్ధిలో ఉన్న వృత్తి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని వివరించారు. క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో పరిశ్రమల్లో పని చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకష్ణ, అకడమిక్ డీన్ శివరామకష్ణ, ఎఫ్‌వో వాసు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కోడా దిలీప్‌కుమార్, డి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు
గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు
గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు


