బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్‌పేటలో నివాసముంటున్న కదంబాల భాగ్యలక్ష్మి గత నెల 25న మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తుండగా ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా నువాపల్లి గ్రామానికి పులి సుభాషిణిని నిందితురాలిగా గుర్తించి శనివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుంచి ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితురాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ బషీర్‌ని సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు అభినందించారు.
ప్రొఫెసర్ సుజాతకు
పేటెంట్ హక్కులు మంజూరు
ఎచ్చెర్ల : యాంటీబయాటిక్ సమూహమైన ‘టెట్రాసైక్లిన్ అనలాగ్’పై పరిశోధనలకు గాను బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగం సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి.సుజాతకు పేటెంట్ (చట్టపరమైన మేథో సంపత్తి హక్కు) మంజూరైంది. 2018 నుంచి ఇరవై ఏళ్లపాటు ఈ హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రధాన పేటెంట్ కార్యాలయం (కోలకత్తా) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుజాతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని శనివారం అభినందించారు.
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు


