బెండి కొండపై ఆక్రమణల తొలగింపు
వజ్రపుకొత్తూరు రూరల్: పెద్దబొడ్డపాడు పంచాయతీ నారాయణపురం, తోటపల్లి సమీపంలో సర్వే నంబర్–252లో ఉన్న బెండి కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణలను శనివారం రెవెన్యూ అధికారులు తొలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెండి కొండను కొందరు నాయకులు రైతులతో కలిసి ఆక్రమించుకున్నారు. ఈ కబ్జాపై ‘10 మంది 100 ఎకరాలు..బెండి కొండపై అక్రమాల పర్వం ’ అనే శీర్షికతో గత నెల పదో తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కజ్జా పర్వంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం తహశీల్దార్ సీతారామయ్య సమక్షంలో యంత్రాల సాయంతో ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ శ్రావణ్, ఆర్‌ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
బెండి కొండపై ఆక్రమణల తొలగింపు


