ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

శ్రీకాకుళం అర్బన్‌: ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించాలని జిల్లా రవాణాశాఖ అధికారి గంగాధర్‌ పిలుపునిచ్చారు. రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శ్రీకాకుళంలోని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో ప్రమాద రహితంగా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను సన్మానించారు. రోడ్డు భద్రతపై మున్సిపల్‌ స్కూల్‌, అమర కౌమది స్కూల్‌లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఎస్పీ వివేకానంద చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా ప్రజారవాణా అధికారి సి.హెచ్‌ అప్పలనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్‌.ఎస్‌.శర్మ, అసిస్టెంట్‌ మేనేజర్లు పి.సంతోష్‌కుమార్‌, ఎ.గంగరాజు, ఎస్‌ఎం ఎంపీ రావు, అధికారులు ఎఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌, పి.ప్రసాదరావు, రాజు, యూ నియన్‌ల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement