పీఎం–ఉషా పథకంపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

పీఎం–ఉషా పథకంపై సమీక్ష

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

పీఎం–ఉషా పథకంపై సమీక్ష

పీఎం–ఉషా పథకంపై సమీక్ష

పీఎం–ఉషా పథకంపై సమీక్ష

ఎచ్చెర్ల: ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (పీఎం–ఉషా) పథకంపై ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ కె. ఆర్‌.రజనీ మాట్లాడుతూ కేరళలోని కన్నూర్‌ యూనివర్సిటీలో పీఎం–ఉషాపై జరిగిన దక్షిణ భారత ప్రాంతీయ సమావేశంలో చర్చకు వచ్చిన ఉన్నత విద్యా రంగ అంశాలను వివరించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పీఎం–ఉషా పథకం క్రింద మంజూరైన నిధుల నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించామని చెప్పా రు. విద్యార్థి కేంద్రీకృత కార్యకలాపాలకు, వినూత్న వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు వర్సిటీ విభాగా లు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, సీహెచ్‌ రాజశేఖరరావు, కె.స్వప్నవాహిని, అధ్యాపకులు పి. సుజాత, పీఎం–ఉషా వర్శిటీ నోడల్‌ అధికారి కె.కావ్యజ్యోత్స్న, ఎగ్జామ్‌ డీన్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌, ఎస్‌ వో సామ్రాజ్యలక్ష్మీ, ఎల్‌.అనంతరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement