రైల్వే స్టేషన్ ఆవరణలో వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆర్‌పీఎఫ్ బ్యారెక్స్ పక్కన సరుబుజ్జిలి మండలం, సవలాపురం జంక్షన్‌కు చెందిన కొల్ల సింహాచలం (58) మృతి చెందారు. మృతుడు బుధవారం ఉదయం ఆ ప్రాంతానికి వాష్ రూమ్ కోసం వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు 108కు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారణ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఆ ప్రాంతం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు పట్టించుకోకుండా విడిచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులకు సమాచా రం రావడంతో గురువారం ఎస్‌ఐ ఎస్.బాలరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతుని జేబు లో ఉన్న ఆధార్ కార్డు ద్వారా సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్‌తో పరిశీల న జరిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.


