హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు | - | Sakshi
Sakshi News home page

హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు

Jan 30 2026 6:56 AM | Updated on Jan 30 2026 6:56 AM

హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు

హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు

హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు

విజయనగరం క్రైమ్‌/గుర్ల: ఆయన చేసేది హోంగార్డు ఉద్యోగం... సంపాదించింది రూ.20 కోట్లు పైబడి. విజయనగరం గోకపేటలోని లక్ష్మీనివాస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాను గురువారం జరిపిన దాడుల్లో ఏసీబీ అధికారులు బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఏసీబీ విభాగంలో సుమారు పదిహేనేళ్ల కిందట నెట్టి శ్రీని వాసరావు హోంగార్డుగా విధుల్లో చేరారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు చేరవేసేవారు. ఇలా రూ.వేలు, రూ.లక్షల్లో నగదు, వివిధ ఆస్తుల రూపంలో లబ్ధిపొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బందితో లోపాయికారి ఒప్పందంతో సంబంధా లు నెరిపేవాడు. ఆయన వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు ఏడాదిన్నర బదిలీ చేయించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు విజయనగరంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ దాడు లు చేసి రెండు ప్లాట్లు, ఒక ఆర్‌సీసీ బిల్డింగ్‌, నా లుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంకు బ్యా లెన్స్‌, కారు, బైక్‌ తదితర ఆస్తులను సీజ్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement