అవస్థల నడుమ..
శాలిహుండం యాత్రలో సారవకోట గ్రామానికి చెందిన తూలుగు కాంతమ్మ మెట్ల మార్గం వద్ద కుప్పకూలింది. పోలీసులు వెంటనే ప్రాథమిక చికి త్స అందించగా, సమీపంలోనున్న కిమ్స్ సిబ్బంది వైద్య చికిత్స అందించారు. అరగంట తర్వాత స్వామి దర్శనం చేయాలని పట్టుపట్టగా బీపీ ఉందని వెళ్లడం అంత మంచిది కాదని తెలిపారు. అదేవిదంగా కొండ మీద రాళ్ల దారుల గుండా ఇష్టానుసారంగా నడిచిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో మరికొంత మందికి స్వల్ప అస్వస్థతకు గురికాగా, పలు సంస్థల ఆరోగ్య శిబిరాల వద్ద చికిత్స పొందారు. మూడేళ్ల చిన్నారికి ఆరోగ్య సమస్య రావడంతో వెంటనే చికిత్స చేశారు.
● తీర్థస్నానం తర్వాత భక్తుల రద్దీ పెరిగింది.
● గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది.
● క్యూలైన్ సమీపంలోని మెట్ల వద్ద ఆరుగురు వృద్ధులు కింద పడిపోవడంతో హాహాకారాలు మిన్నంటాయి. తొక్కిసలాటలో పోలీసులు కూడా ఇరుక్కున్నారు.
● భక్తుల తాకిడితో ఉదయం 10.30 తర్వాత ఈ యాత్రకు కేటాయించిన బస్సులు కూడా ఆపేశారు.
● వంశధార నుంచి నడిచివచ్చిన భక్తులు ఎక్కువమంది ఉపవాసం ఉంటారు. కొండపైకి వచ్చాక తాగునీరు పంపిణీ ప్రారంభించలేకపోవడంతో భక్తులు మండిపడ్డారు.
● దాదాపు రెండు లక్షల మంది భక్తులకు ఒక్క మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేయలేదు.
కొండ రాళ్ల గుండా వెళ్తున్న భక్తులు
సొమ్మసిల్లిన భక్తురాలు
అవస్థల నడుమ..
అవస్థల నడుమ..


