సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలి

Jan 29 2026 6:33 AM | Updated on Jan 29 2026 6:33 AM

సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలి

సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలి

జి.సిగడాం:

పాధ్యాయుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలని ఏపీటీఏఫ్‌ (257) జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు పిలుపునిచ్చారు. బుధవారం ఎందువ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఐఆర్‌, పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేస్తామని అనేక హమీలు ఇచ్చారని, వీటిలో ఒక్క హామీ నేరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో అప్‌గ్రేడ్‌ చేసిన పాఠశాలల్లో హెచ్‌ఎంలు, పీడీ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. యాప్‌లతో ఉపాధ్యాయలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. అలాగే సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఏఫ్‌ నాయకులు కాయల రమేష్‌, కిల్లారి వెంకటరమణ, కమిటీ సభ్యులు బొడ్డేపల్లి రమణమూర్తి, ఎలకల ఆదినారాయణ, పిట్టా అప్పారావు, కోనారి నారాయణప్పడు, కొంచాడ సూర్యారావు, అల్లు బాలాజీ, సనపల రోహిణి కుమారి, ఏనుగుతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement