శ్వేతగిరి.. | - | Sakshi
Sakshi News home page

శ్వేతగిరి..

Jan 29 2026 6:10 AM | Updated on Jan 29 2026 6:10 AM

శ్వేత

శ్వేతగిరి..

నమ్మకాల సిరి

ప్రత్యేకంగా నిలుస్తున్న

శాలిహుండం జాతర

భీష్మ ఏకాదశి వేళ కొనసాగుతున్న సంప్రదాయాలు

అరటి గెలలు..

సొరంగం..

కొండ మధ్యభాగంలోని వీరవసంతేశ్వర ఆలయం కింది భాగంలో సొరంగ మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. శ్వేతగిరి నుంచి శ్రీకూర్మనాథాలయం వరకు ఈ సొరంగం ఉందని, మండు వేసవిలో కూడా చల్లని నీరు ఉంటుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం.

రాళ్లు పేరుస్తూ..

నామం పండ్లు..

సుద్ధతో చేసిన రామలక్ష్మణ బొమ్మలున్న నామం పండ్లను జాతరకు వచ్చేవారంతా కొనుగోలు చేయడం ఆనవాయితీ. వీటిని ఇంటికి తీసుకువెళ్తే ఆ ఏడాదంతా ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడదని నమ్మకం.

శాలిహుండం యాత్ర(ఫైల్‌)

గార : ఉత్తరాయణ పుణ్యకాలంలో హిందువులు ముఖ్యంగా రైతులు ఆది జాతరగా జరుపుకొనే యాత్ర శాలిహుండం గిరి జాతర. ఎన్నో నమ్మకాలు, మరెన్నో విశ్వాసాలు అడుగడుగునా గోచరిస్తుంటాయి. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలి జాతరగా (దాసుళ్లు యాత్ర) పిలిచే ఈ ఉత్సవంలో భక్తులు ఆచరించే కొన్ని నమ్మకాలు, విశ్వాసాలను పరిశీలిస్తే..

వేణుగోపాలుడికి క్షీరాభిషేకం

కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ వేణుగోపాలస్వామి జాతరకు వచ్చే భక్తుల్లో కొందరు ఆలయం ఎదుట అరటి గెలలు కడతారు. కోరిక నెరవేరిన తర్వాత కూడా గెలలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆ పండ్లనే భక్తులంతా ప్రసాదంగా స్వీకరిస్తారు.

చక్రతీర్ధ స్నానం..

శ్వేతగిరి నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న వంశధార నదికి కాళీయమర్ధన వేణుగోపాలుడి ఉత్సవమూర్తులను రెండు పల్లకిల్లో తీసుకెళ్తారు. అక్కడ చక్ర తీర్ధస్నానం చేసే సమయంలో భక్తులు సైతం పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం.

కొండపై రాళ్ల పేర్పు ఎక్కువగా కనిపిస్తుంటుంది. జాతరకు వచ్చిన దంపతుల్లో ఒక్కరైనా స్వామి దర్శనం తర్వాత సొంతింటి నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఇలా కంకర రాళ్లు పేర్చుతారు.

శ్వేతగిరి.. 1
1/4

శ్వేతగిరి..

శ్వేతగిరి.. 2
2/4

శ్వేతగిరి..

శ్వేతగిరి.. 3
3/4

శ్వేతగిరి..

శ్వేతగిరి.. 4
4/4

శ్వేతగిరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement