వెయిట్ లిఫ్టింగ్‌లో అదరహో..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన దూబ హేమశ్రీ సత్తాచాటింది. చంఢీఘర్‌లోని పంజాబ్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న ఆలిండియా అంతర్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 53 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిసింది. హేమశ్రీ శ్రీకాకుళం నగరంలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో చదువుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున టోర్నీలో ప్రాతినిధ్యం వహించింది. శాప్ కోచ్ ఐ.అప్పన్న వద్ద శిక్షణ పొందుతున్న హేమశ్రీ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి పతకాల పంట పండించింది. తండ్రి దూబ రాంబాబు టైలర్‌గా కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి విజయ గృహిణి. తల్లిదండ్రులు, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్, కోచ్‌ల ప్రోత్సాహంతో హేమశ్రీ రాణిస్తూ యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఏపీపీగా తేజేశ్వరరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండో అదనపు జిల్లా కోర్టు(మహిళా కోర్టు) అదనపు పబ్లిక్ పాసిక్యూటర్‌గా (టెన్యూర్)న్యాయవాది శివాల తేజేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన శ్రీకాకుళం బార్ సభ్యుడిగా ఉన్నారు. తేజేశ్వరరావు నియామకం పట్ల శ్రీకాకుళం బార్ అసోషియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.శివప్రసాద్, పి.దామోదరరావు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 27తో గడువు ముగియాల్సి ఉన్నా అభ్యర్థుల సౌకర్యార్థం జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించి నాలుగు ఖాళీలు ఉండగా, పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుంచి రూ.89,720 వరకు వేతన శ్రేణి వర్తించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, ఈ నెల 30లోపు అందజేయాల్సి ఉంటుందని, రిజిస్టర్డ్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా ‘చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ చిరునామాకు పంపాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి హరిబాబు తెలిపారు.
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లాలోని గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తులు ఫిబ్రవరి 19లోగా అందజేయాలని కోరారు. వివరాలకు 9701736862, 8790653296 నంబర్లను సంప్రదించాలని కోరారు.
మధ్యవర్తిత్వమే రాజమార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కక్షిదారులు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం గొప్ప అవకాశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులకు ‘మధ్యవర్తిత్వం’పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య వర్తిత్వంలో ఇరుపక్షాల అంగీకారంతో షరతులను ఖరారు చేసి ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారని వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారమైతే కక్షిదారులు చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ వి.పి.తనకచన్, అడ్వకేట్ పి.జి.సురేష్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు, న్యాయవాదులు ఎ.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో అదరహో..
వెయిట్ లిఫ్టింగ్‌లో అదరహో..


