స్వాధీనం చేసుకున్న
నగదు
కంచిలి బీసీ బాలురు వసతి గృహంలో అసిస్టెంట్ బీసీ వేల్ఫేర్ ఆఫీసర్ బాల ముకుందరావు కింది స్థాయి సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరు సబార్డినేట్ స్టాఫ్ నుంచి రూ.లక్షా 84వేల70 ఏసీబీ స్వాఽధీనం చేసుకుంది. కంచిలి బీసీ బాలుర వసతి గృహాన్ని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌గా వాడుతున్నారు. ఇటీవల భోజనం బిల్లులు వసతి గృహాల అధికారుల ఖాతాల్లో పడ్డాయి. ఆ డబ్బులను ప్రతీ నెలా ఇవ్వాల్సిన ముడుపులకు గాను బి.కాంతారావు, ఎన్.ఉపేంద్ర, ఎస్.రామకృష్ణ, పి.కృష్ణవేణి, టి.కోదండరాం అనే వసతి గృహ అధికారులు తమకు ఇన్‌చార్జ్‌గా ఉన్న వాటితో కలిపి 11వసతి గృహాలకు సంబంధించి ముడుపులను ముట్టజెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి రోజుకి రూ.5చొప్పున నెలకి ఒక విద్యార్థి పేరున రూ.150 ముడుపులు తీసుకుంటున్నట్టు తేలింది. ఎంత మంది విద్యార్థులుంటే అన్ని రూ.150 తీసుకుంటున్నట్టుగా స్పష్టమైంది. ఈ వ్యవహారంలో ఏబీసీడబ్ల్యూఓ, ఇద్దరు సబార్డినేట్లతో పాటు డీబీసీడబ్ల్యూఓను కూడా ఏసీబీ అధికారులు విచారించారు.


