శాలిహుండం..!
దర్శించుకుందాం..
ప్రత్యేక ఏర్పాట్లు
స్వామివారిని భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనికోసం వేల సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశామని పాలకమండలి సభ్యులు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ప్రత్యేక యాత్ర బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గార:
శ్వేతగిరిపై వేంచేసిన కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి యాత్రకు శాలిహుండం ముస్తాబవుతోంది. మాఘశుద్ధ ఏకాదశి(భీష్మ ఏకాదశి) పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే ఈ యాత్రకు ఏంతో ప్రాముఖ్యత ఉంది. బుధవారం సాయంత్రానికి దూరప్రాంత భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. సాయంత్రం పరిసర గ్రామాల్లో స్వామివారి తిరువీధి ఉత్సవంతో ప్రారంభమై, రాత్రి క్షీరాభిషేకసేవ, పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకు వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులను రెండు పల్లకీల్లో తీసుకొని వెళ్లి సాంప్రదాయబద్ధంగా చక్రతీర్థ స్నానమాచరిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. సుమారు 80 వేల మంది భక్తులు యాత్రకు వస్తారని అధికారుల అంచనా.
సంతాన వేణుగోపాలుడు
భీష్మ ఏకాదశి రోజున స్వామివారి ఉత్సవమూర్తులు చేసే చక్రతీర్థ స్నానంలో భక్తులు కూడా స్నానమాచరించి, కొండపై వ్రతమాచరించి ఉపవాసం ఉండి వేణుగోపాలుడిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా గృహ నిర్మాణం చేసుకోవాల్సిన వారంతా జాతర రోజు వచ్చి ఇక్కడి రాళ్లను పేర్చితే తదుపరి ఏడాదిలోగా ఆ కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇక్కడి సొరంగంలో దొరికే నీటిని తీసుకెళ్లి పవిత్ర జలముగా ఉపయోగించడం, మట్టిని తీసుకెళ్లి కొత్త పడవల్లో ప్రారంభ సూచికగా జల్లుకుంటే ఎటువంటి నష్టం ఉండదని మత్స్యకారులు భావిస్తుంటారు. అదేవిధంగా పురాతన పద్ధతుల్లో ఉండే దాసురాళ్లు, దాసుళ్లు తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి కొండపై స్టాల్స్‌లో అమ్ముతున్న విభూతి ఉండలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తుంటారు. అందుకే ఈ జాతరను దాసుళ్ల యాత్రగా పరిగణిస్తారు. శాలిహుండం యాత్ర తర్వాతే ఇంటి దగ్గర సంబరాలు చేసుకోవాలని, దీని తర్వాతనే గ్రామ దేవత పండగలు నిర్వహించడం పరిపాటి. అందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో శాలిహుండం కొండ వద్దకు చేరుకుంటారు. చక్రతీర్థ స్నానంతో భక్తులు స్వామివారితో పాటు స్నానమాచరించి కొండపైనున్న స్వామిని దర్శించుకుంటారు.
ఆలయ ముందుభాగంలో కాళీయ మర్ధన వేణుగోపాలుడు
శాలిహుండం జాతరకు శ్వేతగిరి ముస్తాబు
నేటి సాయంత్రం నుంచి యాత్ర ప్రారంభం
అర్ధరాత్రి తర్వాత మూలవిరాట్‌కు క్షీరాభిషేక సేవ
శాలిహుండం..!
శాలిహుండం..!


