ప్రాణభిక్ష పెట్టండి..!
● క్యాన్సర్ వ్యాధితో మంచంపట్టిన
యువకుడు
● ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
జి.సిగడాం: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు కుమరాపు చందు. వయస్సు 21 సంవత్సరాలు. యువకుడికి క్యాన్సర్ వ్యాధి రావడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. వ్యాధి నయం కావాలంటే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని డీఆర్‌వలస(దాలెమ్మ రాజువలస) గ్రామానికి చెందిన నారాయణరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు చందు. యవకుడు గత ఐదేళ్లుగా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. విశాఖ, హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం తరలించారు. వ్యాధి నివారణ కావాలంటే ప్రత్యేక ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. చందును బతికించడానికి వైద్యులు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని విశాఖలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రతినెలా ఒక్క ఇంజక్షన్ రూ.2.50 లక్షల వరకు అవుతుందని, సుమారుగా ఏడాది పాటు ఈ మందును వాడాలని సూచించారు. అనంతరం శరీరంలో ఉన్న రక్తం మార్పిడి చేసిన తర్వాత క్యాన్సర్ వ్యాధి కోసం ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. అందువలన ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు 63055 62355 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కూలీ చేసి కాపాడుకుంటున్నాం
మాది రెక్కాడితేగానీ డొక్కా డని కుటుంబం. కుమారుడిని బతికించుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నాం. చాలీచా లని డబ్బులతో జీవనం సాగించలేకపోతున్నాం. మా కుటుంబాన్ని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.
– కుమరాపు భూలక్ష్మి
అప్పులు చేసి వైద్యం
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నా కుమారుడికి ప్రతినెలా రూ.2.50 లక్షలు వెచ్చించి మందులు ఇస్తున్నాం. ఇప్పటికే చాలా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నాం. ఇంత మొత్తం ఖర్చు చేయడం వలన నానా కష్టాలు పడుతున్నాం. దాతలు సహకరించి ఆదుకోవాలి. – కుమరాపు నారాయణరావు
ప్రాణభిక్ష పెట్టండి..!
ప్రాణభిక్ష పెట్టండి..!
ప్రాణభిక్ష పెట్టండి..!


