● ఇలా చేరుకోవాలి...
శాలిహుండం యాత్రకు బుధవారం సాయంత్రం, గురువారం చక్రతీర్థ స్నానంతో పాటు స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు మూడు మార్గాల ద్వారా చేరుకోవచ్చని, అందరూ సంయమనం పాటించి సహకరించాలని జిల్లా పోలీసు యంత్రాంగం సూచనలు చేసింది. ఈ మేరకు రూట్ మ్యాప్ వివరాలను సీఐ కె.పైడపునాయుడు తెలియజేశారు.
● జాతీయ రహదారి నుంచి గార – చింతాడ బీటీ రోడ్డు గుండా వచ్చిన భక్తుల బైక్‌లు, ఆటోలను పూసర్లపాడు అసిరితల్లి ఆలయం వద్ద ఉన్న పొలాల్లో పార్కింగ్ చేయాలి. ఒకవేళ అక్కడ పార్కింగ్‌కు అవకాశం లేకుండా నిండిపోతే కొండ నుంచి శాలిహుండం గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డులో వెళ్లి కేజీబీవీ సమీపంలో పార్కింగ్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులకు కొంక్యాణపేట సమీపంలోని ఇటుక బట్టీల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
● శ్రీకాకుళం – కళింగపట్నం రోడ్డులో వచ్చిన భక్తులు గార తర్వాత సినిమా థియేటర్ వద్ద ఆటోలు పార్క్ చేసుకోవాలి. బైక్‌లు బోరవానిపేట పాఠశాలల వద్ద, ఎక్కువైతే శాలిహుండం బౌద్ధ స్థూపాల వద్ద పార్కింగ్ స్థలం ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వెళ్లాలి.
● సతివాడ మీదుగా వచ్చే భక్తులు కొత్తపేట గ్రామం వద్దనే వాహనాలు ఉంచుకోవాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి.
● కొండమీదకి వాహనాలకు అనుమతి లేదు.
విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
ప్రతీ ఏడాది స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దర్శనం కోసం ఉచిత క్యూలైన్‌తో పాటు రూ.20, రూ.50 ల దర్శనాలు ఉంటాయి. పాలకమండలి సభ్యులు, దేవదాయ, రెవెన్యూ, పోలీసులకు భక్తులు సహకరించాలి.
– సుగ్గు మధురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త
● ఇలా చేరుకోవాలి...


