అంబరాన్నంటిన.. సిరిమాను ‘శంబర’ం
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తుల జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది.
అంబరాన్నంటిన.. సిరిమాను ‘శంబర’ం


