ప్రగతి పరుగులు పెడుతోంది | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పరుగులు పెడుతోంది

Jan 27 2026 9:33 AM | Updated on Jan 27 2026 9:33 AM

ప్రగతి పరుగులు పెడుతోంది

ప్రగతి పరుగులు పెడుతోంది

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జి ల్లా ప్రజలను ఉద్దేశించి ప్రగతి సందేశం ఇచ్చా రు. జిల్లా రెండో త్రైమాసిక అంతానికి 43 శాతం జీడీపీ వృద్ధిని సాధించి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే పొదుపు సంఘాల మహిళలకు ‘సీ్త్ర నిధి’ ద్వారా రూ.278 కోట్ల రుణాలు అందించి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని సగర్వంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలోనూ 137.32 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. దీపం–2 కింద జిల్లాలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు 1,91,015 మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసి, 48 గంటల్లోనే రూ. 9. 31 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద 2,54,408 మంది లబ్ధిదారులకు రూ.330.73 కోట్ల నిధు లు అందజేశామన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ కింద 2.79 లక్షల మంది రైతులకు రూ.370.32 కోట్లు పెట్టుబడి సాయం అందించామన్నారు. హిరమండలం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను రూ.176.35 కోట్లతో శరవేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

పొందూరు ఖాదీకి ప్రపంచ గుర్తింపు

జిల్లాలోని పొందూరు ఖాదీకి భౌగోళిక సూచిక (జీఐ) హోదా లభించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్‌ కొనియాడారు. దీనివల్ల చేనేత కార్మికుల నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా జిల్లాకు 5 ప్రాజెక్టుల ద్వారా రూ.5,368 కోట్ల పెట్టుబడు లు, 15,135 మందికి ఉపాధి రానుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ దొనక పృథ్వీరాజ్‌ కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఆర్డీవోలు, ఏఎస్పీలు, డీఎస్పీలు, జిల్లాలోని ఆయా శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

’సీ్త్ర నిధి’ ద్వారా రూ.278 కోట్ల రుణాలు మంజూరులో ప్రథమ స్థానం

పొందూరు ఖాదీకి ‘జీఐ’ హోదా దక్కడం గర్వకారణం

సంక్షేమ పథకాల్లో జిల్లాకు అగ్రస్థానం

77వ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement