కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

Jan 26 2026 6:45 AM | Updated on Jan 26 2026 6:45 AM

కారు

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

పాతపట్నం: బూరగాం ఎస్సీ వీధి వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కాగువాడ గ్రామానికి చెందిన వృద్ధుడు హరిచంద్ర పండి (64) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో నరసన్నపేట నుంచి పర్లాకిమిడి వస్తున్న కారు.. బూరగాం ఎస్సీ వీధి సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న హరిచంద్ర పండి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ శ్రీరామమూర్తి, కానిస్టేబుల్‌ వరలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. హరిచంద్రకు కొబ్బరికాయలు దుకాణం ఉంది. కొబ్బకాయలు కొనేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. హరిచంద్రకు భార్య సరస్వతి, కుమారుడు సిబ్బో పండి, కుమార్తె స్వప్న పొల్లయ్‌ ఉన్నారు. సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం 1
1/1

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement