బాబోయ్ మంటలు!
టెక్కలి రూరల్: టెక్కలి చిన్నబ్రహ్మణవీధిలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అల్లుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఖాళీ స్థలంలో చెత్తాచెదారాలకు గుర్తుతెలియని వ్యక్తులు మంటపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు భయాందోళనకు గురై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ ఓసీ కాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయాణికుల బ్యాగులు, సూట్‌కేసులు, సీట్లను తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నాయక్, ఏఎస్‌ఐ మురళీ, సిబ్బంది పాల్గొన్నారు.


