బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
నందిగాం: పెద్దతామరాపల్లి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై సోమవారం ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు తీరాయి. నందిగాం మండలంలో 11 రైస్‌మిల్లులు ఉండగా సోమవారం నాటికి కేవలం రెండు మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ లు ఉన్నాయి. దీంతో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులంతా ఆ రెండు మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంటూరులోని వినాయక రైస్‌మిల్లు, పెద్దతామరాపల్లిలోని సాయి శ్రీనివాస రైస్ మిల్లులకు ట్రాక్టర్లు పోటెత్తడంతో అన్‌లోడింగ్‌కు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దతామరాపల్లి సర్వీస్ రోడ్డుపై బారులు తీరిన ట్రాక్టర్లు


