కార్మిక హక్కులను హరిస్తే సహించం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. ఏఐటీయూ సీ జిల్లా మహాసభల రెండో రోజు సోమవారం స్థాని క క్రాంతి భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక కార్మిక చట్టాలను పెద్ద ఎత్తున ఉద్య మాల చేసి సాధించుకున్నామన్నారు. అటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పని గంటల పెంపుదల అన్యాయమని ధ్వజమెత్తారు. చట్టాలు, హక్కులు పరిరక్షించుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు గా ముత్యాలరావు, టి.తిరుపతిరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు గౌరవాధ్యక్షులుగా సీహెచ్ గోవిందరావు, కె.అప్పలరాజు, డి.కిరణ్, పి. సత్యం, ఉపాధ్యక్షులుగా బి.శేషు, వై.సూర్యనారా యణ, బి.అప్పలరాజు, కె.శ్రీనివాస్‌లతో పాటు లబ్బ రాజు, పార్థసారధి, దుర్గారావు, ఎర్రయ్య, ఆర్.సూర్యనారాయణ, షేక్ భాను, సరిత, జగదీశ్వరి, వాసు, సురేష్, దుర్గాప్రసాద్, హైమావతి, గౌరీ శ్వర్, ప్రమీల, ఆదిలక్ష్మి, సావిత్రి, రామకృష్ణ తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.


