అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్‌ఎస్‌కు 193 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే అర్జీలను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్క రించి బాధితులకు న్యాయం చేయాలని జేసీ ఫర్మా న్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొని అర్జీదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. సోమ వారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 193 ఫిర్యాదు లు నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించా రు. కార్యక్రంలో డీఆర్‌వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ప్రత్యేకాధికారి వేంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను పరిశీలిస్తే...
●నందిగాం మండలంలోని హరిదాసుపురంలో అనర్హురాలైన రమాదేవికి ఆశ కార్యకర్తగా అధికారులు నియమించారని, దీనిపై చర్యలు తీసుకోవా లని గ్రామానికి చెందిన అక్కూరు మీనా ఫిర్యాదు చేశారు.
●శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్ద గనగళ్లవానిపేట పంచాయతీ పరిధి పుక్కళ్లపేట, గాంధీ నగర్, చిన్న గనగళ్లపేట, ఖాజీపేట, నరసయ్యపేట తదితర గ్రామాలు కోతకు గురై ప్రమాదపుటంచున ఉన్నాయని, అందువలన నదీకోతకు గురవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
●పోలాకి మండలంలోని జొన్నం గ్రామానికి చెంది న గేదెల అప్పల నరసమ్మ తన పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిర్మాణాన్ని ఆపి తనకు న్యాయం చేయాలని కోరారు.
అడ్డగోలు పనులు చేస్తున్నారు
ఆమదాలవలస నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తల సిఫార్సుల మేరకు అధికారులు అడ్డగోలు పనులు చేస్తున్నారని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రాజకీయ కారణాలతో తొలగించడం జరిగిందని, చెక్కు పునరుద్ధరించాల ని కోరారు. అలాగే సరుబుజ్జిలి మండలం కూనజమునిపేటలో పంచాయతీ తీర్మానం లేకుండా అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణాలు జరుపుతుండడంతో చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మంజూరు చేయాలని విన్నవించారు. బూర్జ మండలం తిమడాం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనిచేసిన మహిళకు సాంకేతిక కారణాలతో పది వారాల వేతనం చెల్లించలేదని, వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనతో పాటు నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, బెండి అప్పలనాయుడు, బద్రి రామారా వు, మనుకొండ వెంకటరమణ, కోవిలాపు చంద్రశేఖర్, సూర్య నారాయణ, వెంకట రమణ ఉన్నారు.


