ఇదేం పద్ధతి..?
ఇబ్బందులు తప్పడం లేదు
అన్ని అనుమతులతో పెట్టాం
బీసీ వసతి గృహానికి సమీపంలో ఉన్న వైన్‌షాపు
శ్రీకాకుళం రూరల్:
మండల పరిధిలోని సింగుపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఒక సిమెంట్ రోడ్డుకు ఆనుకొని ఎకై ్సజ్ అధికారులు కొద్ది నెలలు క్రితం వైన్‌షాపును ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు పక్కనే ఉన్న సింగుపురం ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సాయంత్రం 4.30 గంటల తర్వాత స్కూల్ విడిచిపెట్టగానే హాస్టల్‌కు చేరుకుంటారు. అయితే ఆ సమయంలో వైన్‌షాపునకు వచ్చే వాహనాలు, మందుబాబులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ గేటును అనుసరించి వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీంతో స్టడీ అవర్, రాత్రులు చదివే సమయంలో ఏకాగ్రత సాధించలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ మెయిన్ గేటు, వైన్‌షాపునకు మధ్య కేవలం ఒక సిమెంట్ రోడ్డు మాత్రమే ఉంది. నేరుగా గేటు నుంచి విద్యార్థులకు వైన్‌షాపు కనిపిస్తోంది. రాత్రి 10 గంటల వరకూ వైన్‌షాపుతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న చిల్లర బడ్డీలు మందుబాబులతో నిండిపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సింగుపురం గ్రామ నడిబొడ్డున వైన్‌షాపును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు, బీసీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి దూరంలో షాపు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఎకై ్సజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోలే దు. ఇప్పటికై నా బీసీ హాస్టల్‌కు ఎదురుగా ఉన్న వైన్‌షాపును తరలించే చర్యలు తీసుకోవాలి.
– ఆదిత్యనాయుడు, సర్పంచ్, సింగుపురం
సింగుపురంలోని వైన్‌షాపును అన్ని నిబంధనలతో ఏర్పాటు చేశాం. దీనివలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్కూల్స్‌కు దగ్గర్లో వైన్‌షాపు ఉండకూడదు. కానీ హాస్టల్ ఎదురుగా ఉన్నా పర్వాలేదు.
– ఎస్.గోపాలకృష్ణ, ఎకై ్సజ్ సీఐ


