క్రీడలతో మానసిక ఉల్లాసం
ఎచ్చెర్ల: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని కాకినాడ, ఏయూ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు అన్నా రు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఐపీఎస్‌జీఎం మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. సాంకేతిక విద్యాశాఖ అకడమిక్స్ ఉప సంచాలకుడు బెహరా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐపీఎస్‌జీఎం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో ఎన్‌సీసీ క్యాడెట్ల పిరమిడ్ ప్రదర్శన, విద్యార్థుల శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని తొమ్మిది కళాశాలల నుంచి మొత్తం 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో క్రీడ లు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అమదాలవలస ప్రిన్సిపాల్ డా.బి.జానకిరామయ్య, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రిన్సిపాల్ విక్టర్‌పాల్, సీతంపే ట జీఎంఆర్‌పీ ఓఎస్‌డీ బీవీఎస్‌ఎన్ మూర్తి, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళావాల టెక్కలి ఓఎస్‌డీ డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం


