రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు: పలాస జీఆర్పీ పరిధిలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం జరిగిన రైలు ప్రమా దంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీ ఆర్పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ప్రమాదంలో మృతి చెందిన ట్లు చెప్పారు. మృతుడి కుడి చేతిపై రాజు అనే పేరు తో ఉన్న లవ్ సింబల్, ఇత్తడి రింగ్ ఉందని చెప్పా రు. బ్లూ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ రంగు ప్యాంటు, తెలుపు రంగులోని కట్ బనియన్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఎవరైనా గుర్తుపడితే తక్షణమే పలాస జీఆర్పీ పోలీసుల 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సిక్కోలు ఆటగాళ్లు దుమ్మురేపారు. కర్నూలు జిల్లా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఏపీ రాష్ట్ర స్థాయి జూడో క్యాడెట్, జూనియర్స్ జూడో చాంపియన్‌షిప్–2025 పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు నాలుగు పతకాలతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వశం చేసుకున్నారు. కె.సౌమ్యరాణి, బి.అక్షయ బంగారు పతకాలు, కె.శివరామరాజు రజత పతకం, ఎస్.యశ్వంత్ ప్రసాద్ కాంస్య పతకం సాధించి సత్తాచాటారు. శాప్ జూడో కోచ్ పీఎస్ మణికుమార్ జిల్లా క్రీడాకారుల బృందం వెన్నెంటే ఉంటూ ప్రోత్సహంచారు. క్రీడాకారులను జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు పి.సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, కార్య నిర్వాహక కార్యదర్శి పైడి సునీత, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డీఎస్‌డీఓ ఏ.మహేష్‌బాబు, పీడీ–పీఈటీ సంఘ అద్యక్షుడు పి.తవిటయ్య, సలహదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, ఆర్.స్వాతి, కోచ్ మణికుమార్ అభినందించారు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి


