కానిస్టేబుల్స్‌కు క్రమశిక్షణ ఎంతో అవసరం
శ్రీకాకుళం రూరల్: పోలీసు కానిస్టేబుల్స్‌కు క్రమశిక్షణతో పాటు శారీరక ధృడత్వం, సాంకేతిక నైపుణ్య త, ప్రజలకు సేవచేసే గుణం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికై న రాజమండ్రి, కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది కానిస్టేబుల్స్‌కు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగం గౌరవప్రదమైందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధు లు నిర్వహించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్వేయంగా పనిచేయాల న్నారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగంలో సవాళ్లతో కూడిన ఒత్తిళ్లు వస్తాయని, మానవత్వాన్ని ఎప్పుడూ వదలకూడదని పేర్కొన్నారు. అదనపు ఎస్సీ, ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ కేవీ రమణ మాట్లాడుతూ శిక్షణ సమయంలో శారీరక ధృడత్వం, మానసిక స్థైర్యం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమన్నారు. సైబర్ నేరాలు ప్రస్తుత సమా జంలో సవాలుగా మారాయని, సాంకేతికను అంది పుచ్చుకొని అందుకు తగిన శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, శేషాద్రి, గోవిందరావు, ఏవో సీహెచ్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.


