గంజాయితో యువకుడు అరెస్టు
నరసన్నపేట: ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న పూస దేవిచంద్ అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. అతడి వద్ద నుంచి 2.180 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు తెలిపారు. మడపాం టోల్‌గేట్ వద్ద ఎస్‌ఐ శేఖరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో దేవీచంద్ అనుమానాస్పదం కనిపించడంతో పట్టుకొని ఆరా తీయగా గంజాయి గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇతడు గుంటూరు జిల్లా మంగళగిరి మండ లం పాతూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా లోని జరగడగడ గ్రామానికి చెందిన సిమంచల్ సాహు వద్ద తక్కువ ధరకు గంజాయి కొని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఈయన వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


