పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తాం
సరుబుజ్జిలి: మండలంలోని పురుషోత్తపురం పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. గ్రామంలో తన తండ్రి కిల్లి వెంకటప్పలనాయుడు పేరుమీదుగా నిర్మించిన పీహెచ్‌సీ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ తల్లిదండ్రులు వెంకటప్పలనాయుడు, విశాలాక్ష్మి విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిల్లి రామ్మోహనరావు, శ్రీరామ్మూర్తి, వెంకటరమణ, పంచాయితీ ఉప సర్పంచ్ పైడి నర్సింహప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఈక్యూ ఫర్ పీస్‌తో బీఆర్‌ఏయూ ఎంవోయూ
ఎచ్చెర్ల: ఆన్‌లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్‌ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్‌లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు.
మహిళ అదృశ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన ఒక మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్‌కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తాం


