అగ్నివీర్‌కు ఎన్‌సీసీ క్యాడెట్లు
● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్‌తో పాటు అనేకమంది ఎన్‌సీసీ–బీ సర్టిఫికెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్‌కు ఎన్‌సీసీ క్యాడెట్లు


